Breaking News

ఇరాన్‌లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం

Published on Mon, 02/27/2023 - 10:05

ఇరాన్‌లో వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ మరువుక మునుపే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్‌ మినిస్టర్‌ యూనెస్‌ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు.

అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్‌ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి కూడా. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన  22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్‌ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్‌ నిరసనలతో అట్టుడుకుపోతోంది. 

(చదవండి: పాక్‌, చైనాలకు సాయం కట్‌ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి