Breaking News

Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్‌ వార్నింగ్‌

Published on Thu, 03/05/2026 - 15:48

అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్‌ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్‌.. యూఎస్‌, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్‌ తేల్చి చెప్పింది.

హర్మూజ్‌ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్‌.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్‌.. యూఎస్‌, ఇజ్రాయెల్‌, యూరప్‌ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్‌ ప్రకటనతో భారత్‌ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.

కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.

మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్‌ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌’గల్ఫ్‌ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్‌ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)