ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్‌

Published on Tue, 10/22/2024 - 07:09

టెహ్రాన్: తమపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఇరాన్‌ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి తమకు తెలుసునని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, యూఎన్‌ భద్రతా మండలి  స్విస్ ప్రెసిడెన్సీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ రాసిన లేఖ తీవ్రమైన ఆందోళన, రెచ్చగొట్టే విధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని అన్నారు.  

ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. చట్టవిరుద్ధమైన సైనిక దురాక్రమణకు  అమెరికా పరోక్ష ఆమోదం,  స్పష్టమైన మద్దతును ప్రకటిస్తున్న  నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌  తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ‘‘అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే దురాక్రమణ చర్యలను ప్రేరేపించటం, ప్రారంభించటంపై అగ్రరాజ్యం అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

క్రెడిట్స్‌: The International Index

అక్టోబరు 1న ఇరాన్‌.. ఇజ్రాయెల్‌పై చేసిన  మిసైల్స్‌ దాడికి ఎలా? ఎప్పుడు?  స్పందిస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు జో బైడెన్‌ ఇటీవల స్పందించారు. ప్రస్తుతం  ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై చేసే  ప్రతీకార దాడిపై స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.

ఇక.. టెహ్రాన్ మద్దతుగల హమాస్, హెజ్‌బొల్లాకు చెందిన నాయకులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్‌ను అంతంచేసినందుకు ప్రతీకారంగా ఇరాన్  ఇటీవల ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు మిత్ర దేశమైన ఇజ్రాయెల్..  గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను దాడులకు అంతం చేసి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.

చదవండి: ట్రంప్‌ ‘మెక్‌డొనాల్డ్‌’ షోపై భారీ ట్రోలింగ్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)