Breaking News

ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్‌ భిన్న స్వరం

Published on Thu, 01/18/2024 - 07:30

ఢిల్లీ: పాకిస్థాన్‌ భూభాగంపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడులపై భారత్‌ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే..  ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని,  ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో  భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఇది ఇరాన్‌, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాకు తెలిపారు. 

ఇరాక్‌, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.. ఆ మరుసటి రోజే పాక్‌ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి.  అయితే భారత్‌ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. జైష్‌ అల్‌ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్‌,  మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్‌ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్‌ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై జైష్‌ అల్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ ఈ సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. 



‘‘పొరుగు దేశం పాక్‌ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్‌ రక్షణ విభాగం ప్రకటించింది. 

మరోవైపు పాక్‌ మాత్రం  ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్‌ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్‌.. తెహ్రాన్‌(ఇరాన్‌ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)