Breaking News

ఇజ్రాయెల్‌ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

Published on Wed, 07/16/2025 - 20:59

అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్‌ అవీవ్‌ను క్యాన్సర్‌ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్‌ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్‌ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్‌ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.

12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్‌లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది.

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)