Breaking News

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

Published on Sat, 07/04/2026 - 17:29

టెహ్రాన్: హార్మూజ్‌ జలసంధి అంటే ప్రాంతీయేతర శక్తులు సైనిక బలప్రదర్శన చేసే వేదిక కాదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది హెచ్చరించారు. హార్మూజ్‌ జలసంధిపై బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై స్పందించిన ఘరీబాబాది.. సంక్షోభాలు సృష్టించే వారే వాటి పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు.

ఘరీబాబాది ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. "హార్మూజ్ జలసంధి ప్రాంతీయేతర శక్తుల సైనిక బలప్రదర్శన వేదిక కాదు. హార్మూజ్ భద్రతకు హామీ ఇచ్చే బాధ్యతాయుత శక్తిగా ఇరాన్ ఈ జలమార్గంలో జరిగే ఏ సైనిక కదలికనైనా అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. హార్మూజ్ భద్రత తీరప్రాంత దేశాల చేతుల్లోనే ఉంటుంది. సంక్షోభాలు సృష్టించే వారు తమ సాహసోపేత చర్యల పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన హెచ్చరిక" అని పేర్కొన్నారు.
 
బ్రిటన్, ఫ్రాన్స్‌ ఏమన్నాయి? 
ఒమాన్ తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి పని చేయడానికి అంగీకరించిందని కీర్‌ స్టార్మర్, ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. "హార్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక సముద్ర మార్గం. అన్ని దేశాల నౌకలు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించే పరిస్థితిని పునరుద్ధరించడం ప్రపంచ ఆందోళనగా మారింది. తన సార్వభౌమ ప్రాదేశిక జలాల్లో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి పనిచేయడానికి ఒమాన్ సుల్తానేట్ అంగీకరించింది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేగాక, "హార్మూజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి మద్దతుగా సైనిక మిషన్‌ను మోహరించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ స్థిరత్వం, అన్ని దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, ప్రపంచ భద్రత, నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణం, అంతర్జాతీయ చట్టాన్ని పరిరక్షించేందుకు తమ భాగస్వామ్య దేశాలతో సన్నిహిత సహకారం కొనసాగించాలనే నిబద్ధతను బ్రిటన్, ఫ్రాన్స్ మరోసారి స్పష్టం చేశాయి" అని పేర్కొన్నారు.

జూలై 2న బహ్రెయిన్‌లో జరిగిన అమెరికా నేతృత్వంలోని ప్రాంతీయ భద్రతా సదస్సును ఇరాన్ తీవ్రంగా విమర్శించింది. ఆ సైనిక సదస్సు చట్టబద్ధతను, ఆ ప్రాంతంలో అమెరికా కమాండ్ వ్యవస్థ అధికారాన్ని ఘరీబాబాది తిరస్కరించారు. "హార్మూజ్‌పై అధికారం సెంట్‌కామ్‌(అమెరికా సెంట్రల్ కమాండ్)ది కాదు, ఇరాన్‌దే" అని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో జరిగే సైనిక సదస్సు పర్షియన్ గల్ఫ్‌కు చట్టబద్ధ వ్యవస్థను, భద్రతను ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)