Breaking News

అణ్వాయుధ ప్రోగ్రామ్‌.. అమెరికాకు ఇరాన్‌ కండీషన్‌..!

Published on Thu, 03/05/2026 - 18:14

అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్‌ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్‌ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్‌ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్‌ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్‌పై ఇంకా ఆపరేషన్‌ ముగియలేదన్నారు.

మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్‌ పోర్టుపై ఇరాన్‌ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్‌కుమార్‌, దిలీప్‌ సింగ్‌ మృతిచెందారు.

ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్, నేవీ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్‌ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు.


 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌