Breaking News

ఇరాన్‌ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?

Published on Thu, 06/26/2025 - 11:03

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్‌ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్‌ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్‌ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్‌ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.

ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్‌ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్‌లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్‌. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చావుకు భయపడే మనిషి కాదు..  
ఇరాన్‌లో ఈ నెల 12న ఇజ్రాయెల్‌ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్‌లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్‌ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్‌ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)