Breaking News

ఇరాన్‌ వీధుల్లో సంబరాలు.. యువరాజు రెజా కీలక వ్యాఖ్యలు

Published on Sun, 03/01/2026 - 08:17

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్‌ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ప్రజలు పలుచోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ యువరాజు రెజా కూడా స్పందించారు. ఖమేనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇరాన్‌ సైన్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

హిజాబ్ లేకుండా డ్యాన్స్‌.. 
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్‌​లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్నట్లు సీఎన్ఎస్ పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేసింది. ఇరాన్ శివారు ప్రాంతమైన బేసత్ టౌన్‌లో ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ నియంత మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లెవీ ఒక వీడియోను పంచుకున్నారు.

నా కల నిజమైంది.. 
మరోవైపు.. ప్రముఖ ఇరాన్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ మసిహ్ అలీనెజాద్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సందర్భంగా అలీనెజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ప్రజలు ఖమేనీ చేతిలో మరణించారన్న వార్తలు చూస్తూ నిద్రలేచేదాన్ని. కానీ నా జీవితంలో మొదటిసారి ఒక శుభవార్తతో నిద్రలేచాను. నాకు గట్టిగా అరవాలని, పరిగెత్తాలని అనిపిస్తోంది. నేను కల గంటున్నానా? కొత్త ప్రపంచానికి స్వాగతం' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 ఖమేనీ వారసుడికి తావు లేదు: రెజా పహ్లావీ
ఇరాన్ మాజీ రాజవంశానికి చెందిన వారసుడు, యువరాజు రెజా పహ్లావీ కూడా ఖమేనీ మరణంపై స్పందించారు. ఈ సందర్భంగా..‘నిరంకుశ పాలకుడు, పదివేల మంది ఇరాన్ ముద్దుబిడ్డలను బలిగొన్న హంతకుడు అలీ ఖమేనీ చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టుకుపోయాడు. అతని మరణంతో, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగింపు దశకు చేరుకుంది. అతి త్వరలోనే ఇది చరిత్రలోని చెత్తబుట్టలోకి వెళుతుంది. ఖమేనీ వారసుడిని నియమించడానికి ఈ వ్యవస్థలోని మిగిలిన శక్తులు చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. అతని స్థానంలో వారు ఎవరిని ఉంచినా, వారికి చట్టబద్ధత ఉండదు, మనుగడ ఉండదు. వారు కూడా నిస్సందేహంగా ఈ పాలన చేసిన నేరాల్లో భాగస్వాములుగానే ఉంటారు.

 

 

నేరస్థుడైన ఖమేనీ మరణం ఇరాన్ 'లయన్ అండ్ సన్ నేషనల్ రివల్యూషన్' కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి కుటుంబాలకు, బాధిత తల్లులకు, గాయపడిన పిల్లల హృదయాలకు ఒక ఓదార్పుగా అవుతుంది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన ముగిసింది. ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ఇకనైనా ప్రజలతో చేతులు కలపాలి. కూలిపోతున్న వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నించవద్దు. ఇది సైన్యానికి లభించిన చివరి అవకాశం. స్వేచ్ఛాయుతమైన ఇరాన్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు. 
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు