Breaking News

హార్ముజ్‌ మూసివేత గండం గడిచినట్లేనా?!

Published on Fri, 06/27/2025 - 13:14

ఇరాన్‌పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్‌( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్‌ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్‌కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్‌ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్‌ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్‌ కాకుండా ఇంకా గల్ఫ్‌ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్‌ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్‌ ఆయిల్ని ఆ యా గల్ఫ్‌ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్‌ సరఫరా విలువ.

యూకే ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మాజీ డైరెక్టర్‌ సర్‌ అలెక్‌ యూన్గర్‌ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్‌ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్‌ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్‌ ఒక్క ఇరాన్‌ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్‌ ఉపయోగించే ఆయిల్‌లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్‌ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! 

– డా.కొండి సుధాకర్‌ రెడ్డి  లెక్చరర్

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)