Breaking News

నిరసనలను కఠినంగా అణచివేస్తాం

Published on Sat, 01/10/2026 - 06:18

దుబాయ్‌: ఇరాన్‌లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్‌ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. 

ఇరాన్‌ యువరాజు పిలుపు
గురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్‌ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్‌ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్‌ చేశారు. 

జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్‌ ఫోన్‌కాల్స్‌పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్‌ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిట్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు