జెలెన్‌స్కీకి ఇరాన్‌ వార్నింగ్‌.. మూల్యం చెల్లించుకుంటావ్‌

Published on Mon, 07/27/2026 - 00:12

ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి వార్నింగ్ ఇచ్చారు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీయే వ్యక్తిగతంగా కారణమని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు జెలెన్‌స్కీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

ఇటీవల కాస్పియన్ సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరోకరు గాయపడ్డారు. ఇరాన్ తాజాగా దీనిని  జెలెన్‌స్కీ స్వయంగా ధృవీకరించారు. ఉక్రెయిన్ బలగాలు (ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ / సెక్యూరిటీ సర్వీసెస్) ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. 

ఈ ఘటనపై అబ్బాస్‌ అరాఘ్చీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. " జెలెన్‌ స్కీ ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి చేసి, ఒక నావికుడిని చంపారు. ఐరోపాను తమ యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు చేసిన ఈ చర్య, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను బహిరంగంగా ఉల్లంఘించడమే. ఈయూ ఉన్నత ప్రతినిధి కల్లాస్, విదేశాంగ మంత్రి లావ్రోవ్‌లతో జరిపిన సంభాషణలలో, కీవ్‌లోని ఆ ఉచిత భోజనప్రియుడు చేసిన దానికి జవాబు చెప్పకుండా ఉండలేమని స్పష్టం చేశారు".

కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ సౌదీ అరేబియాతో వ్యూహాత్మక, దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, డ్రోన్ రక్షణ వ్యవస్థలు, సాంకేతికత బదిలీ, ఆహార భద్రత, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా  ఉక్రెయిన్ తన యుద్ధ అనుభవాన్ని, ముఖ్యంగా డ్రోన్లను తిప్పికొట్టే సాంకేతికతను సౌదీ అరేబియాతో పంచుకోవడం పట్ల ఇరాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్యం చేస్తోంది. 
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)