Breaking News

ఇరాన్‌ అంటే అంత భయమా?.. ట్రంప్‌ గగన ప్రయాణంలో ట్విస్ట్‌

Published on Thu, 07/09/2026 - 13:08

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఓ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఖతార్‌ నుంచి అందుకున్న వేల కోట్ల విలువైన కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఉండగానే.. తిరుగు ప్రయాణంలో ఆయన పాత విమానాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న వేళ ట్రంప్‌ విమానం మార్చడం వెనుక భద్రతా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్రంప్‌ కోసం ఖతార్‌ ప్రభుత్వం సుమారు 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు ₹3,400 కోట్లు) విలువైన బోయింగ్‌ 747-8 లగ్జరీ జెట్‌ను బహుమతిగా ఇచ్చింది. ఖతార్‌ రాజ కుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. అమెరికా రక్షణ సంస్థ ఎల్‌3హ్యారిస్‌ టెక్నాలజీస్‌ ఈ విమానంలో భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్‌ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చింది. బోయింగ్‌ సంస్థ కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానాల తయారీలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈ విమానాన్ని తాత్కాలికంగా ‘బ్రిడ్జ్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’గా ఉపయోగిస్తున్నారు.

ఈ విమానం గురించి ట్రంప్‌ ‘‘అద్భుతం (truly magnificent)’’ అంటూ ప్రశంసించారు. యూరప్‌లోని పలు అమెరికా సైనిక స్థావరాలకు తీసుకెళ్లి అక్కడి సైనికులకు చూపించాలని కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మిల్డెన్‌హాల్‌ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు.

కొత్త విమానం ఉండగా.. పాతదానిలో ప్రయాణం
నాటో సదస్సు సమావేశం కోసం ట్రంప్‌ ఈ కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో టర్కీకి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం అనూహ్యంగా పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను ఎంచుకున్నారు. అంకారా నుంచి బ్రిటన్‌లోని రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ మిల్డెన్‌హాల్‌ (RAF Mildenhall) స్థావరం వరకు పాత విమానంలో ప్రయాణించిన ట్రంప్‌.. అక్కడ కొత్త విమానాన్ని ఎక్కి అమెరికాకు తిరిగి వెళ్లారు.

ఇరాన్‌ ముప్పు కారణమా?
కొత్త విమానాన్ని వదిలి పాతదానిలో ఎందుకు ప్రయాణించారన్న ప్రశ్నకు ట్రంప్‌ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఇరాన్‌ నుంచి తనకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్‌ హిట్‌ లిస్ట్‌లో నేనే నంబర్‌ వన్‌’’ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచాయి. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు పాత విమానాన్ని ఎంచుకోవాలని సూచించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అయితే ట్రంప్‌ పేషీ మాత్రం విమానం మార్పు భద్రతా కారణాలతో కాదని తెలిపారు.

కొత్త విమానం భద్రతపై సందేహాలు?
కొత్త ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సదుపాయాలు వంటి మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయంలోనే మార్పులు పూర్తి చేయడంతో భద్రతా ప్రమాణాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానాలు ఎన్నో ఏళ్లుగా పరీక్షించబడ్డ రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

విమానం బహుమతిపై వివాదం
విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత విలువైన విమానాన్ని స్వీకరించడంపై అమెరికాలో రాజకీయ, నైతిక విమర్శలు కూడా వచ్చాయి. విమానం బహుమతిగా వచ్చినప్పటికీ.. భద్రతా మార్పులు, సాంకేతిక అప్‌గ్రేడ్‌ల కోసం అమెరికా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ట్రంప్‌ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విమాన యాజమాన్యాన్ని డొనాల్డ్‌ జే. ట్రంప్‌ ప్రెసిడెన్షియల్‌ లైబ్రరీ ఫౌండేషన్‌కు బదిలీ చేసే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

మొత్తంగా.. ‘అద్భుతం’ అని ట్రంప్‌ మెచ్చిన విమానాన్నే తిరుగు ప్రయాణంలో పక్కన పెట్టడం.. ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ కొత్త చర్చకు దారితీసింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)