Breaking News

ఇన్నాళ్లకు వేదికపై ఖమేనీ.. మారుమోగిన నినాదాలు

Published on Sun, 07/06/2025 - 09:25

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌తో వివాదం.. ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా భీకర దాడుల అనంతరం తాజాగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ  ఒక బహిరంగ వేదికపై కనిపించారు. టెహ్రాన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్‌ ఘర్షణల నేపధ్యంలో ఇంతకాలం ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.

తాజాగా ఇరాన్‌లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం సంతాప దినాలలో ఖమేనీ కనిపించారు. షియా ముస్లిం క్యాలెండర్‌లోని అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఆయతుల్లా ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఖమేనీ ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఖమేనీ సంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన అక్కడి జనం పలు నినాదాలు చేశారు.
 

జూన్ 14న ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నేత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వైమానిక దాడుల తొలి రోజుల్లో ఖమేనీ రికార్డ్ చేసిన సందేశాలు మీడియాకు విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్  ఘర్షణల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన ప్రసంగాలను ముందే రికార్డ్ చేసి ప్రసారం చేశారు. 

ఇది కూడా చదవండి: పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)