Breaking News

మళ్లీ రణరంగం! 

Published on Thu, 07/09/2026 - 06:15

దుబాయ్‌: పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ సైన్యం బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. హార్మూజ్‌ జలసంధిలో నౌకలపై ఇరాన్‌ దాడులు చేసిందంటూ అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా ఇరాన్‌ చమురు విక్రయాలపై ఆంక్షలు విధించింది. లైసెన్స్‌ను రద్దు చేసింది. రాత్రిపూట ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. 

హార్మూజ్‌లో సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసి, వాటికి నష్టం కలిగించినందుకు అమెరికా దళాలు ఇరాన్‌పై దాడులు చేశాయని యూఎస్‌ మిలటరీ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. ఇరాన్‌ వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ ఉపయోగించే 80కి పైగా చిన్న పడవలతో సహా పలు లక్ష్యాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్‌ విరుచుకుపడింది. 

ఈ దాడుల్లో అమెరికా స్థావరాలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. బహ్రెయిన్‌ తన క్షిపణి హెచ్చరిక సైరన్‌ను మోగించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మరోవైపు అమెరికా దుందుడుకు చర్యపై ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఖలీబాఫ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెదిరింపులు, బలవంతపు వసూళ్ల శకం ముగిసింది’’అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఖలీబాఫ్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అమెరికా దాడులకు, ఒత్తిల్లకు తలవంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)