Breaking News

ప్రమాదం బారిన జీవవైవిధ్యం

Published on Thu, 05/22/2025 - 08:31

సృష్టిలోని అన్ని జీవరాశులలో ఏ ఒక్కటీ అధికం కాదు, ఏదీ అల్పం కాదు. అన్నీ సమానమే. అవన్నీ ఒకదానిపై  మరొకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన అవసరాలకు ప్రకృతిపై ఆధారపడతాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం ముందుకు సాగదు. దీనిని గమనించిన నిపుణులు, శాస్త్రవేత్తలు జీవవైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా చూడాలని ఎన్నోఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి ప్రతీఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని(International Day for Biological Diversity) నిర్వహిస్తూ వస్తోంది.

దెబ్బతీస్తున్న జీవనశైలి
ప్రస్తుతం భూమిపై ఉన్న కోట్లాది జాతుల వైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామంగా చెబుతారు. మనిషి జీవనశైలి కారణంగా పర్యావరణంలో కాలుష్యం(Pollution) వ్యాపించి, భూగోళం వేడెక్కిపోతున్నది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. పర్యవసానంగా పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో గల 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ ఒకనాడు సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతుజాతులు ఉండేవి. వివిధ కారణాలతో అనేక జీవాలు కనుమరుగవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికి పైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటివనరులు అంతరించిపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను స్వార్థ ప్రయోజనాల కోసం ఎండగట్టారు. అరణ్యాలలోని వన్యప్రాణుల్ని  వేటాడి అంతమొందిస్తున్నారు.

అక్కడ జీవవైవిధ్యం పదిలం
వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, కీటకనాశనుల వినియోగానికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్  గుర్తింపు పొందింది. అయితే దేశంలో ఆదివాసులు అధికంగా ఉన్నచోట జీవవైవిధ్యం పదిలంగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో 53 మిలియన్లకు మించిన ఆదివాసులు నివసిస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 80 శాతానికి మించిన రీతిలో గిరిజనులున్నారు. దీంతో అక్కడ జన్యువైవిధ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న జన్యుమార్పిడి విధానం జీవవైవిధ్యాన్ని దెబ్బ తీస్తోంది. వీటిని రూపొందించి, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మానవ మనుగడ ప్రశ్నార్థకం
వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప, కప్పను తిని పాము, పామును తిని గద్ద జీవిస్తుంది. గద్ద మరణించాక దానిని వివిధ క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టులా సాగుతుంది. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా, మిగతా అన్నిటి మీదా ప్రభావం పడుతుంది. దీనికి  మనిషి  అడ్డుపడితే  అది వినాశనానికి దారి తీస్తుంది. భూమిపై ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ(Human survival) ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది జీవరాశులు అంతరించిపోతున్నాయి. అయితే వాతావరణ సమతుల్యానికి, పర్యావరణ పరిరక్షణకు జీవరాశులను కాపాడుకోవడం  అత్యవసరం. అందుకే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి: నేడు ప్రధాని మోదీ ‍ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)