Breaking News

కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి

Published on Wed, 12/24/2025 - 10:03

టొరంటో: కెనడాలోని టొరంటోలో 30 ఏళ్ల భారత యువతి హిమాన్షి ఖురానా దారుణ హత్యకు గురయ్యారు. గత శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా, మరుసటి రోజు ఉదయం ఒక నివాసంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు మృతురాలి భాగస్వామే ఇందుకు కారకుడని ప్రాథమికంగా నిర్ధారించారు.

పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ గఫూరీ(32)ని పట్టుకునేందుకు కెనడియన్ చట్ట అమలు సంస్థలు దేశవ్యాప్త వారెంట్ జారీ చేశాయి. గఫూరీ ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతూ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఈ  ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిమాన్షి ఖురానా మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది.  టొరంటో పోలీసుల హోమిసైడ్ యూనిట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. కాగా ఈ ఘటన విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన భద్రతా పరమైన ఆందోళనలను మరోసారి లేవనెత్తింది.

ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్‌వీఎం3- ఎం6

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)