Breaking News

భీకర పోరు: సాహో ఇండియన్‌ సూపర్‌ విమెన్‌, వైరల్‌ వీడియో

Published on Wed, 10/18/2023 - 13:03

Indian Super Women In Israel: ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్  దాడి చేసి (అక్టోబర్ 7) 11 రోజులు గడిచాయి.  ఇంకా భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతీ రోజు పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ మహిళల సూపర్‌ విమెన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం (అక్టోబర్ 17) సోషల్ మీడియాలో వీరికి సంబంధంచి  ఒక వీడియోను ఎక్స్‌( ట్విటర్‌) లో పోస్ట్‌ చేసింది. హమాస్ దాడిలో మహిళలు తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను  కూడా  కాపాడారు దీనికి సంబంధించి వీడియోను షేర్‌ చేసింది

ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ కేర్‌ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. హమాస్‌ ఉగ్రదాడిలో చాలా ధైర్యసాహసాలను ప్రదర్శించి వృద్ధురాలిని  ప్రాణాలను కాపాడిన వైనం విశేషంగా నిలుస్తోంది. ఈ మహిళల ప్రయత్నాలను, సంకల్పాన్ని అభినందిస్తూ ఇజ్రాయెల్‌ ఎంబసీ  "ఇండియన్ సూపర్ వుమెన్" అంటూ ొక వీడియోను పోస్ట్ చేసింది. డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ టెర్రరిస్ట్‌లు లోనికి రాకుండా అడ్డుకున్న భయానక స్థితిని  ఈ వీడియోలో ఒకరు వివరించారు. బుల్లెట్ గుర్తులతో ఉన్న తలుపులు,  గోడలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సాహస వనితల పేర్లు సబిత,మీరా మోహనన్‌ 

 కాల్పుల మోత మోగినా నుంచి వెనక్కి తగ్గలే..!
ఏఎల్‌ఎస్‌తో బాధ పడుతున్న రాచెల్ అనే వృద్ధురాలికి కేర్‌ టేకర్స్‌గా  మీరాతో పాటు గత మూడేళ్లుగా పనిచే‍స్తున్నామనీ సబిత చెప్పారు. నైట్ డ్యూటీలో ఉండగా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సైరన్ మోతలు వినిపించాయి.  బయలు  దేరబోతుండగానే  పరిస్థితి మరింత ముదిరిందని ఆమె పేర్కొన్నారు.  అసలు ఏమి చేయాలో తోచలేదు.  ఇంతలో రాచెల్ కుమార్తె  ఫోన్‌ చేసి తలుపులన్నీ లాక్ చేసుకోమని ఆమె చెప్పారు. నేలపై మరింత పట్టు సాధించడానికి  చెప్పులు కూడా తీసేసి అలా భయంతో ఉన్నాం.

మరి కొద్ది నిమిషాల్లో, ఉగ్రవాదులు  ఇంట్లోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టారు. అద్దాలు పగలగొట్టేశారు. మళ్ళీ కూతురికి ఫోన్ చేసి ఏం చేద్దాం అని అడిగాం. డోర్ పట్టుకుని అలాగే ఉండమని చెప్పడంతో  అలాగే నాలుగైదు గంటలు అక్కడే  వారిని  అడ్డుకోవడానికి  శాయశక్తులా ప్రయత్నించామంటూ  తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.  అసలు బయట ఏమి జరుగుతుందో  అర్థం కావడంలేదు.  మధ్యాహ్నం 1 గంటకు, వారికి మళ్లీ షాట్‌లు వినిపించాయి. అయితే ఈ సారి ఇజ్రాయెల్  సైన్యం  వచ్చిందని ఇంటి యజమాని ష్ములిక్  చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని సబిత వెల్లడించారు. క్షిపణులు పడతాయని తెలుసు కానీ ఉగ్రదాడి జరుగుతుదని అస్సలు ఊహించలేదన్నారు. మీరా పాస్‌పోర్ట్,  ఎమర్జెన్సీ బ్యాగ్ అన్నీ  వాళ్లు పట్టుకు పోయారని,  ఇపుడు తమ వద్ద ఏమీ  లేవని చెప్పారు. 

ఇదిలావుండగా, గాజాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడులో కనీసం 500 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్   ప్రకటిచింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)