Breaking News

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు ఇజ్రాయెలీ అవార్డు!

Published on Sat, 10/10/2026 - 06:08

టెల్‌అవీవ్‌: ఫ్లై దుబాయ్‌ విమానం హైజాక్‌ యత్నాన్ని కో–పైలెట్‌ కత్తిపోట్లను సైతం ఎదుర్కొని అడ్డుకున్న భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు ఐసాక్‌ హెర్జోగ్‌ తెలిపారు. 

ఈ హైజాక్‌ ఘటనను అడ్డుకున్న ఆరుగురు ఇజ్రాయెలీలు టాలి మానెస్, జ్వికా మానెస్, యానివ్‌ హయూన్, షోటా ముసాయెవ్, అసాఫ్‌ రాజౌన్, ఓర్‌ పార్డిలోవ్‌లకు గురువారం ఆయన  ‘ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజమ్‌’ను అందించారు. జెరూసలెంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెలీ హీరోలను ఈ రోజు సత్కరించుకున్నామని, భారతీయ కెప్టెన్‌  మచ్ఛార్‌ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నామని తెలిపారు. 

మచ్ఛార్‌ తెగువ, స్థైర్యం, వృత్తిపరమైన నిబద్ధతల కారణంగానే ఓ విధ్వంస చర్యకు అడ్డుకట్ట పడిందని, పూర్తిగా కోలుకున్న తరువాత అతడికి ఇజ్రాయెల్‌ తరఫున అవార్డు అందించడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన చెప్పారు. అక్టోబరు ఏడవ తేదీ నాటి హమాస్‌ దాడుల తరువాత అధ్యక్షుడు హర్జోగ్‌ ఏర్పాటు చేసిన అత్యుతన్న పౌర పురస్కారం ఇది. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ప్రాణాలకు తెగించి అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించే వారిని గుర్తించేందుకు, గౌరవించేందుకు ఈ అవార్డు ఏర్పాటైనట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)