Breaking News

లోయలోకి దూసుకెళ్లిన కారు కేసు: ‘భారత సంతతి డాక్టర్‌కు జైలు శిక్ష విధించలేం’

Published on Thu, 06/27/2024 - 12:39

న్యూయార్క్‌:  భార్య, పిల్లలను ఉద్దేశపూర్వకంగా హత్య చేసేందుకు కారును లోయలోకి నడిపారనే కేసులో భారత సంతతి డాక్టర్‌ ధర్మేష్‌ పటేల్‌​ జైలు శిక్ష విధించలేదని కాలిఫోర్నియ కోర్టు ప్రకటించింది. 

ధర్మేష్‌ పటేల్‌ తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆయన మానసిక అనారోగ్యం కారణంగా జైలు శిక్ష విధించటం లేదని జడ్జి సుసాన్ జకుబోవ్స్ తెలిపారు. ఆయన మానసిక ఆరోగ్యానికి చికిత్స​ అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయన విడుదల,  అనారోగ్యానికి సంబంధించి చికిత్స వివరాలను జూలై 1న వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. 

గతేడాది కాలిఫోర్నియాలో ఉండే డాక్టర్‌ ధర్మేష​ పటేల్‌.. పిల్లలతోపాటు తన భార్య ప్రయాణం చేస్తున్న కారు శాన్ మాటియోలోని హైవే పక్కన ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల అమ్మాయి, 9 ఏళ్ల బాలుడు సహా ధర్మేష్, ఆయన భార్య ప్రాణాలతో భయటపడ్డారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ధర్మేష్ కావాలనే కారును లోయలో పడేశాడని అనుమానిస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేష్‌ను శాన్ మాటియో కౌంటీలోని జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంతో కేసుపై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్ష విధించటంలేదని పేర్కొంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)