‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉ‍రిమిన భారత్‌

Published on Tue, 01/27/2026 - 10:07

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’పై పాక్ ప్రతినిధి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశాన్ని, భారత ప్రజలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై స్వార్థపూరిత కథనాలను అల్లుతోందని హరీష్  పేర్కొన్నారు.  

భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇస్లామాబాద్‌కు లేదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. 2025, మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యాన్ని హరీష్‌ వివరిస్తూ.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సమాధానంగానే ఈ చర్య తీసుకున్నట్లు హరీష్ గుర్తుచేశారు. ఈ ఆపరేషన్‌ ద​్వారా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
 

అనంతరం భారత సైనిక శక్తికి భయపడి మే 10న నేరుగా పాకిస్తాన్‌.. భారత్‌కు ఫోన్ చేసి, యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని హరీష్‌  తెలిపారు. సింధు జలాల ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల క్రితం భారత్ ఈ ఒప్పందాన్ని సద్భావనతో కుదుర్చుకుందని, అయితే పాకిస్తాన్.. మూడు యుద్ధాలతో పాటు, లెక్కలేనన్ని ఉగ్రదాడులతో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కిందని హరీష్ విమర్శించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం  కారణంగా వేలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన తీరు మార్చుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన గురించి మాట్లాడే ముందు పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాయబారి చురకలంటించారు. పాక్ సైన్యం రాజ్యాంగ విరుద్ధంగా 27వ సవరణ ద్వారా ఎలా తిరుగుబాటు చేసిందో, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు జీవితకాల రక్షణ ఎలా కల్పించిందో గుర్తెరగాలని హరీష్‌ అన్నారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితిని వేదికగా వాడుకోవద్దని ఆయన పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా?

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)