Breaking News

జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌ దాడిలో భారతీయుడు మృతి

Published on Tue, 07/14/2026 - 07:17

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన మొంబాసా, అల్ బహియాహ్ అనే రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది సభ్యుడు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దాడి ఎక్కడ జరిగింది?
ఈ రెండు ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల్లోని హార్మూజ్‌ జలసంధి దక్షిణ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణి దాడి జరిగింది. దాడి అనంతరం రెండు నౌకల్లోనూ మంటలు చెలరేగినా, అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చినట్లు యూఏఈ తెలిపింది. కాగా, ఈ దాడిని యూఏఈ ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది.

ఇక, అమెరికా ఇటీవల ఇరాన్‌పై కొత్తగా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత ఉధృతమవుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.

ఇదిలా ఉండగా.. మరణించిన వ్యక్తి భారతీయుడే అని యూఏఈ ధృవీకరించింది. గాయపడిన వారిలో కూడా పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగితే, చమురు సరఫరా మరియు ధరలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)