ఇండోనేషియా తోవలో భారత్‌: వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌

Published on Wed, 07/16/2025 - 11:36

వాషింగ్టన్‌: అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా ప్రకటన చేశారు. అమెరికా-ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం మార్గంలోనే భారత్‌ పయనిస్తున్నదని అన్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లేదా ఏకపక్ష సుంకాలను ఎదుర్కోనేందుకు ట్రంప్ నిర్ణయించిన ఆగస్టు ఒకటి గడువుకు ముందే దీనిపై  భారత్‌- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇండోనేషియాతో తాను ప్రకటించిన వాణిజ్య ఒప్పందం మాదిరిగనే భారత్‌ కూడా ఇదే మార్గంలో పనిచేస్తున్నదని, ఇది అమెరికా, భారత మార్కెట్‌లకు అత్యధిక లబ్ధి చేకూరుస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా- ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోకి దిగుమతులపై 19 శాతం సుంకం ఉంటుంది. అయితే అమెరికా నుండి ఇండోనేషియాకు ఎగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని వాషింగ్టన్‌లో ట్రంప్‌ ప్రకటించారు. భారత్‌ కూడా ఇదే మార్గంలో పనిచేస్తోందని, భారత్‌తో ఇదే విధమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్నారు.

ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదుర్చుకోకపోతే 35 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్‌ యూరోపియన్ యూనియన్‌కు లేఖలు పంపారు. అమెరికా- భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఒకవేళ ఇండోనేషియా ఒప్పందాన్ని ప్రతిబింబిస్తే, భారతదేశ ఎగుమతులపై 19 శాతం సుంకం  ఉండనుంది అలాగే యూఎస్ నుండి దిగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)