ట్రంప్‌ చెప్పింది అబద్ధం

Published on Sun, 08/03/2025 - 04:23

వాషింగ్టన్‌: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గుడ్లురిమి చూసినా భారత్‌ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది. భారత్‌ చమురు, ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా ఆర్జించిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం వెచ్చిస్తోందని ట్రంప్‌ ఇప్పటికే ఆరోపించారు. 

ఈ కొనుగోల్లు ఆపకపోతే భారీ దిగుమతి సుంకాలు విధిస్తానని భారత్‌ను ట్రంప్‌ బెదిరించినా రష్యా ముడిచమురును భారత రిఫైనరీ కంపెనీలు నిరాటంకంగా కొనుగోలుచేస్తూనే ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భవిష్యత్తులో రష్యా నుంచి భారత్‌ చమురును కొనుగోలుచేయబోదనే వార్తలను విన్నానని ట్రంప్‌ శనివారం వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే జాతీయమీడియాలో భిన్నమైన వార్తలు రావడం విశేషం. 

‘‘రష్యా నుంచి చమురు కొనే సంస్కృతికి భారత్‌ మంగళం పాడుతుందని విన్నా. ఇది నిజంగా మంచి విషయం. అయితే ఇందులో నిజమెంతో నాక్కూడా తెలీదు. తర్వాత ఏం జరుగుతుందో వేచిచూద్దాం’’ అని ట్రంప్‌ న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌ గల్ఫ్‌ క్లబ్‌లో మీడియాతో ట్రంప్‌ అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ఎంతగా బెదిరించినా సరే భారత్‌ తన స్వప్రయోజనాలకు, సార్వ¿ౌమతానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మరోసారి రుజువైందని జాతీయమీడియాలో శనివారం పలు కథనాలు వచ్చాయి. 

‘‘ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయాలా? వద్దా? కొంటే ఎంత పరిమాణంలో కొనాలి? అనేవి కేవలం మార్కెట్‌ ధర ప్రకారంమే నిర్ణయం తీసుకుంటాంగానీ ట్రంప్‌ వంటి బయటివ్యక్తి బెదిరింపులకు భయపడికాదు’’ అని రిఫైనరీల సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘‘ ముడి చమురు నాణ్యత, సరఫరా వ్యయాలు, ఇతరత్రా ఖర్చుల గురించే మేం ఆలోచిస్తాంగానీ అమెరికా ఆదేశించిందనో మరెవరో వద్దన్నారో మేం చమురు కొనుగోళ్లను ఆపబోం’’ అని భారతీయ రిఫైనరీలు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)