Breaking News

వాణిజ్య చర్చలపై వెనక్కి తగ్గిన భారత్‌: ట్రంప్‌ తీరుపై మాజీ ఆర్థిక కార్యదర్శి ఫైర్‌

Published on Sun, 08/31/2025 - 07:33

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై అదనపు సుంకాలు విధించడంతో ఆ దేశంతో భారత్‌ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే భారత్.. అమెరికాతో వాణిజ్య చర్చల నుండి వెనక్కు తగ్గిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ వ్యాఖ్యానించారు.

ఎన్‌డీటీవీతో సుభాష్ గార్గ్ మాట్లాడుతూ ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందన్నారు. భారత్‌ ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తూ, భారీగా లాభాలు పొందుతోందంటూ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను సుభాష్ గార్గ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణ ఆర్థిక వాస్తవికత కాదని, ఇదొక రాజకీయ నాటకమని ఆయన పేర్కొన్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు వలన భారత వాస్తవ పొదుపు సంవత్సరానికి 25 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాదని, 2.5 బిలియన్‌  అమెరికా డాలర్లకు దగ్గరగా ఉందని గార్గ్ అన్నారు.

ఈ విధంగా తప్పుడు సంఖ్యను చెప్పవచ్చుగానీ, ట్రంప్ దీనిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని గార్గ్‌  ఆరోపించారు. గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం షిప్పింగ్, భీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నాక భారత్‌.. రష్యన్ బారెల్స్‌ నుంచి అందుతున్న డిస్కౌంట్‌  బ్యారెల్‌కు కేవలం మూడు నుంచి నాలుగు అమెరికన్‌ డాలర్లు మాత్రమేనని అన్నారు.  భారత్‌ చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని గార్గ్‌ స్పష్టం చేశారు.

అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదని, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని, ప్రధాని  మోదీ దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీ పడనని ప్రతిజ్ఞ చేశారని గార్గ్‌ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలని వస్తున్న పిలుపులపై గార్గ్‌ మాట్లాడుతూ  అది పిచ్చితనమని, అమెరికా- భారత్‌లు వస్తు వినియోగం, సేవారంగాలలో లోతుగా కలిసిపోయాయన్నారు. అందుకే అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదన్నారు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు