Breaking News

సొంత కరెన్సీలోనే చెల్లింపులు

Published on Sun, 07/16/2023 - 05:39

అబుధాబి: భారత్‌–యూఏఈ సంబంధాలు మరో కీలక మైలురాయికి చేరుకున్నాయి. వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్సులో పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణంలో శనివారం యూఏఈ రాజధాని అబుదాబిలో ఆగారు. అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమయ్యారు.

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరిన ఏడాదిలోనే రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 శాతం మేరకు పెరగడంపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం 85 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ20 భేటీ సమయానికి 100 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని ఆకాక్షించారు. వాణిజ్య చెల్లింపులను సొంత కరెన్సీలోనే చేపట్టాలని, ఇండియన్‌ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ వ్యవస్థ(యూపీఐ)ను యూఏఈకి చెందిన ఇన్‌స్టంట్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫాం(ఐపీపీ)తో అనుసంధానం చేయాలని  అంగీకారానికి వచ్చారు.

రెండు దేశాల పేమెంట్స్‌ మెసేజింగ్‌ సిస్టమ్స్‌ను లింక్‌ చేసే విషయం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌ను యూఏఈలో ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల విద్యాశాఖాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. పరస్పర వాణిజ్య చెల్లింపులను భారత్‌ కరెన్సీ రూపాయి, యూఏఈ కరెన్సీ దిర్హంలో చేసేందుకు ఉద్దేశించిన ఎంవోయూపై రెండు దేశాల సెంట్రల్‌ బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేశారని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సహకారం, పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు.

ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్‌28 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న యూఏఈకి భారత్‌ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. మరింత సుస్థిర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కాప్‌28 అధ్యక్షుడిగా నియమితులైన సుల్తాన్‌ అల్‌ సబేర్‌తో చర్చించానన్నారు. కాప్‌28 వార్షిక సమావేశాలు దుబాయ్‌లో నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 12వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మోదీని సబేర్‌ ఆహా్వనించారు. పర్యావరణ మార్పులకు గురైన దేశాలకు వాగ్దానం ప్రకారం 100 బిలియన్‌ డాలర్ల సాయం అందించాలని సంపన్న మోదీ, అల్‌ నహ్యాన్‌ సంయుక్త ప్రకటనలో కోరారు.

‘‘యూఏఈ అధ్యక్షునితో భేటీ సంతోషం కలిగించింది. అభివృద్ధిపై ఆయన దార్శనికత ప్రశంసనీయం.  భారత్‌–యూఏఈ సంబంధాలపై సమగ్రంగా చర్చించాం’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. అంతకుముందు అబుధాబి అధ్యక్ష భవనం వద్ద నహ్యాన్‌ మోదీకి ఎదురేగి ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికారు. మోదీ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మోదీకి నహ్యాన్‌ విందు ఇచ్చారు. రాత్రికి ప్రధాని భారత్‌ చేరుకున్నారు. యూఏఈ సెంట్రల్‌ బ్యాంకుతో ఒప్పందం అన్ని  లావాదేవీలకూ వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. ‘‘పెట్టుబడులు, రెమిటెన్స్‌లకు దీనితో ఊతం లభిస్తుంది. యూఏఈలోని భారతీయులకు లావాదేవీల చార్జీలు తగ్గడమే గాక సమయం కూడా కలిసొస్తుంది’’ అని తెలిపింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)