Breaking News

అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా

Published on Tue, 11/19/2024 - 09:54

ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్‌ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్‌ డోర్స్‌’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు.  


⇒ 2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది.  

⇒అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం.  

⇒ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్‌ దేశాలున్నాయి.  

⇒చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్‌ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.  

⇒2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది.  

⇒ ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి.  
⇒అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌(మాస్టర్స్, పీహెచ్‌డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది.  
⇒ఇండియన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్‌ నాన్‌–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది.  

ఓపెన్‌ డోర్స్‌ రిపోర్టును ఇనిస్టిట్యూట్‌ 
ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్, కల్చరల్‌ అఫైర్స్‌ కూడా సహకారం అందిస్తోంది. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)