Breaking News

కెనడాకు భారత్ మరోసారి హెచ్చరికలు..!

Published on Tue, 10/03/2023 - 16:03

ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 10 నాటికి గడువును కూడా విధించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాలనే నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన విషయం తెలిసిందే.  

ప్రస్తుతం ఢిల్లీలో 62 మంది కెనడా దౌత్య అధికారులు ఉంటుండగా.. ఆ సంఖ్యను 41కి తగ్గించుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10 తర్వాత ఇంకా ఎక్కువ మంది దౌత్య అధికారులు ఉంటే.. వారికి రక్షణను రద్దు చేస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ వార్తలపై అటు.. కేంద్రంగానీ, విదేశాంగ శాఖ గానీ అధికారికంగా స్పందించలేదు.

ప్రస్తుతం కెనడా-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కెనడా డిమాండ్ చేసింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు


 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)