పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. ఉగ్రవాదంపై నిలదీత!

Published on Thu, 07/23/2026 - 08:06

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సరిహద్దు ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు.

సహజ వనరుల పాలన, శాంతి, భద్రత, సమృద్ధికి పునాది అనే అంశంపై జరిగిన ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న రాజ్యాంగ, చట్టపరమైన వాస్తవం ఇదేనని తేల్చిచెప్పారు.

కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఏకైక వివాదం భారత్ భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని హరీశ్ స్పష్టం చేశారు. సింధు జలాల ఒప్పందంపై మాట్లాడుతూ, ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదం కొనసాగుతున్న తరుణంలో పరస్పర విశ్వాసం, సద్భావనతో కూడిన సహకారం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. భారత్‌పై నిందలు వేయడం మాని, పాకిస్తాన్ తన దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో సీజేపీ నిరసన: 8.4 లక్షలు దాటిన సంతకాలు!

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)