ఐరాసలో పాక్‌ పరువు తీసిన భారత్‌

Published on Tue, 12/16/2025 - 08:47

పాకిస్థాన్‌ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్‌ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్‌ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్‌షిప్‌ ఫర్‌ పీస్‌ అనే అంశంపై జరిగిన ఓపెన్‌ డిబేట్‌లో పాకిస్థాన్‌ మరోసారి జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్‌ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 

జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ భారతదేశానికి విడదీయరాని భాగాలు.  వాటిపై పాకిస్థాన్‌కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్‌ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్‌పై ఉగ్రదాడులు జరిపింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన. 

అంతటితో ఆగకుండా..  పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్‌ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)