Breaking News

‘అరుణాచల్’ వివాదం: చైనా వాదనపై భారత్‌ మండిపాటు

Published on Wed, 11/26/2025 - 07:29

న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక భారత మహిళను 18 గంటలకు పైగా నిర్బంధించడంపై భారత్‌ తన దౌత్యపరమైన నిరసన తెలియజేసింది. చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే భారత పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ, ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్.. లండన్ నుండి జపాన్‌కు వెళ్తుండగా ట్రాన్సిట్ సమయంలో అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలయ్యింది.

చైనా అధికారులు ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్  అయినందును ఆమె పాస్‌పోర్ట్‌ చెల్లదని ప్రకటించి, ఆమెను వేధింపులకు గురి చేశారు. కాగా ఈ ఘటన అంతర్జాతీయ విమానయాన నిబంధనలు,  చైనా వలస నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లున్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)పేర్కొంది.  ఈ ఘటనపై భారత ప్రభుత్వం చైనా తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ  జారీ చేసిన ప్రకటనతో మరింత తీవ్రమైంది. ‘జాంగ్నాన్ చైనా భూభాగం. భారతదేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు’ అని చైనా ప్రతినిధి పేర్కొన్నారు.

దీనికి ప్రతిస్పందనగా ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. ‘అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. ఇది విడదీయరాని భాగం. ఇది వాస్తవం. చైనా వైపు నుండి ఎంత తిరస్కరణ వచ్చినా, ఈ  వాస్తవాన్ని మార్చలేం’ అని స్పష్టం చేశారు. ప్రయాణికురాలు థాంగ్‌డాక్ తన అనుభవాన్ని ‘ఎక్స్‌’లో వివరిస్తూ, తన జన్మస్థలాన్ని లక్ష్యంగా చేసుకొని వేధించారని, పదేపదే ప్రశ్నించారని, విరుద్ధమైన సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన భారత్‌ ప్రభుత్వం చైనా అధికారులు హాస్యాస్పద కారణాలతో ప్రేమా వాంగ్ థాంగ్‌డాక్‌ను నిర్బంధించారని ఆరోపించింది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సహించదగినదికాదని, అరుణాచల్ ప్రదేశ్ స్థితిపై చర్చకు అవకాశం లేదని న్యూఢిల్లీ స్పష్టంగా చైనాకు తన సందేశం పంపింది.

ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే!

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)