Breaking News

‘హజ్‌’ కోటా నిర్థారణ.. ఎందరు వెళ్లొచ్చంటే..

Published on Mon, 11/10/2025 - 09:23

న్యూఢిల్లీ: హజ్ యాత్ర-2026కు సంబంధించి భారత్‌ కొటా ఎంతనేది నిర్ణారణ అయ్యింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు సౌదీ అరేబియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా జెడ్డాలో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. 2026 హజ్ యాత్రకు భారత యాత్రికుల కోటా ఇప్పుడు 1,75,025గా నిర్ధారణ అయ్యింది.  

మంత్రి రిజిజు నవంబర్ 7 నుండి 9 వరకు సౌదీ అరేబియాలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరుదేశాల సమన్వయం, లాజిస్టిక్స్ ఏర్పాట్లు మొదలైన అంశాలపై దీనిలో చర్చించారు.  భారత యాత్రికుల కోసం అవసరమైన ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
 

ఈ సమావేశం తర్వాత, రెండు దేశాల ప్రతినిధులు హజ్- 2026 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. హజ్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, టెర్మినల్ వన్‌, హరమైన్ స్టేషన్‌తో సహా జెడ్డా, తైఫ్‌లోని హజ్, ఉమ్రా తదితర ప్రదేశాలను మంత్రి సందర్శించారు. భారత్‌-సౌదీ అరేబియా సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రిజిజు ‘ఎక్స్‌’ లో రాశారు.

ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో కేరళ బస్సులు బంద్‌

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు