Breaking News

అది నిజం కాదు.. చైనాకు అంత సీన్‌ లేదు!

Published on Wed, 12/31/2025 - 10:39

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తామే చల్లార్చామంటూ చైనా చేసిన ప్రకటనపై భారత్‌ స్పందించింది. అయితే చైనాకు అంత సీన్‌ లేదని భారత్‌ అంటోంది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్‌ ఎప్పుడూ ఒకేరకమైన విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేస్తూ.. డ్రాగన్‌​ కంట్రీ ప్రకటనను తోసిపుచ్చింది.   

చైనా ప్రకటనను కేంద్ర వర్గాలు తోసిపుచ్చినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..  భారతదేశం మధ్యవర్తిత్వంపై ఎప్పటినుంచో స్పష్టమైన వైఖరిని అవలంభిసతోంది. ఆపరేషన్‌ సిందూర్ సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదు. కేవలం పాకిస్తాన్‌ DGMO (Director General of Military Operations) భారత్‌ను సంప్రదించి కాల్పుల విరమణ కోరింది. కాబట్టి.. భారత్‌ ఎప్పటికీ మూడోపక్ష జోక్యాన్ని అనుమతించదు అని పేర్కొన్నాయి. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట సర్జికల్‌ స్ట్రయిక్సతో సర్వనాశనం చేసింది. ఈ నేపథ్యంతో మే 7-10వ తేదీల మధ్య ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. రెండు దేశాల సైనిక డీజీఎంవోల సంప్రదింపుల ఫలితంగా సడలిపోయాయని మోదీ సర్కారు ప్రకటించింది. కానీ,

తాజాగా బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన టారిఫ్‌ బెదిరింపులతోనే ఇరు దేశాలు దిగొచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. దీనికి కారకుడంటూ భారతీయ మూలాలున్న తన ప్రత్యేక సహాయకుడు రికీ గిల్‌ను ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా సత్కరించింది కూడా. ఈ పరిణామాల నడుమే.. మే నెల ఉద్రిక్తతల సమయంలో పాక్‌కు ఆయుధాలను సరఫరా చేసిన చైనా ఇప్పుడు మధ్యవర్తిత్వం నడిపి ఉద్రిక్తతలను చల్లార్చామంటూ ప్రకటించుకోవడం కొసమెరుపు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి