Breaking News

‘భారత్‌ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్‌కు నిక్కీ హేలీ హెచ్చరిక

Published on Thu, 08/21/2025 - 09:37

వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. ట్రంప్‌ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని  ఆమె అన్నారు. వీటిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.

బుధవారం ప్రచురితమైన న్యూస్‌వీక్ ఆప్-ఎడ్‌లో.. ఆమె భారతదేశాన్ని చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని అన్నారు. ట్రంప్‌ విధించిన అదనపు సుంకాలు, భారత్‌- పాక్‌ మథ్య సంధి కుదిర్చానంటూ అమెరికా  పేర్కొనడం.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా భారత్‌- అమెరికా సంబంధాలలో విభేదాలు కనిపించాయని, ట్రంప్ యంత్రాంగం భారత్‌పై 25 శాతం సుంకాలతో దాడి చేసిందని ఆమె అ‍న్నారు. భారత్‌-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు.

2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను సమర్థించిన నిక్కీ హేలీ ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యుత్తమ ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని, అది చైనా మాదిరిగా ప్రత్యర్థి కాదన్నారు. ఇప్పటివరకు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి  దీటుటా ఎదుగుతున్న దేశంతో స్నేహ సంబంధాలను దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు.

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తుచేశారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే, ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురిచేయదని ఆమె  అన్నారు. ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో ఐక్యరాజ్యసమితికి 29వ అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఉన్నారు. అమెరికా అధ్యక్ష మంత్రివర్గంలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్‌గా ఆమె పేరొందారు. 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)