Breaking News

ట్రంప్‌ బుకాయింపులు 

Published on Thu, 08/07/2025 - 05:01

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడుతున్నారు. టారిఫ్‌ల బాంబులు పేలుస్తున్నారు. కానీ, అదే అమెరికా అదే రష్యా నుంచి యురేనియం, ఎరువులు, రసాయనాలు భారీగా దిగుమతి చేసుకుంటోంది. తమ అవసరాల కోసం రష్యాపై ఆధారపడుతోంది. రష్యా నుంచి దిగుమతుల గురించి తనకేమీ తెలియదని డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వ్యాఖ్యానించారు. అసలేం జరుగుతోందో తనిఖీ చేస్తానని అన్నారు.

 ట్రంప్‌ మాటల్లోని ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ శాఖ ఎండగట్టింది. ట్రంప్‌ బుకాయింపులు గణాంకాల సాక్షిగా బహిర్గతమయ్యాయి. నిజానికి అమెరికా–రష్యా మధ్య బలమైన వాణిజ్య బంధం కొనసాగుతోంది. అణు ఇంధన పరిశ్రమల కోసం అమెరికా కంపెనీలు రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం పల్లాడియంను, వ్యవసాయం కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాయి.

 అమెరికా ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే.. అమెరికా–రష్యా మధ్య 2024లో 5.2 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 3.5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం సరుకులకు సంబంధించినదే. అమెరికా నుంచి రష్యాకు 528.3 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. రష్యా నుంచి అమెరికా 3 బిలియన్‌ డాలర్ల సరుకులు దిగుమతి చేసుకుంది. 

అంటే రష్యాతో అమెరికాకు 2.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. 2025 ప్రథమార్ధంలో రష్యా నుంచి దిగుమతులు 2.4 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు అమెరికా సెన్సెస్‌ బ్యూరో, బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ అనాలిస్‌ గణాంకాలు చెబుతున్నాయి నాలుగేళ్ల క్రితం ఇవి 14.14 బిలియన్‌ డాలర్లుగా ఉండేవి. అయినప్పటికీ 2022 జనవరి నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి అమెరికా 24.51 బిలియన్‌ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది.  

→ 2021లో రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయిన ఎరువుల విలువ 1.14 బిలియన్‌ డాలర్లు. 2024లో ఇది 1.27 బిలియన్‌ డాలర్లు.  
→ 2021లో రష్యా నుంచి యూఎస్‌కు 646 మిలియన్‌ డాలర్ల విలువైన యురేనియం, ప్లుటోనియం వచ్చాయి. 2024లో 624 మిలియన్‌  డాలర్లకు తగ్గింది.  
→ 2021లో 1.59 బిలియన్‌ డాలర్ల విలువైన పల్లాడి యం దిగుమతి చేసుకోగా, 2024లో 878 మిలియన్‌ డాలర్ల  సరుకు దిగుమతి చేసుకుంది.  
→ రష్యా నుంచి ఇండియా కంటే చైనా అధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.  
→ 2024లో చైనా ఏకంగా 62.6 బిలియన్‌ డాలర్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇండియా దిగుమతులు 52.7 బిలియన్‌ డాలర్లే. దీనిపై ట్రంప్‌ నోరు మెదపడం లేదు.      

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)