Breaking News

ఎక్కడ చమురు కొనాలనేది భారత్‌ ఇష్టం

Published on Tue, 12/09/2025 - 05:17

మాస్కో: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు ముడిచమరును విక్రయించుకునేందుకు అవరోధాలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్‌ను చమురుకొనుగోళ్ల విషయంలో ఆకర్షిస్తోందన్న ఆరోపణలపై రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్‌ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ సోమవారం మాస్కోలో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌ ఎల్లప్పుడూ సార్వభౌమ దేశమే.

 విదేశీ వాణిజ్య విధానాలు, నచ్చిన దేశం నుంచి చమురు వనరుల కొనుగోలు కార్యకలాపాల్లో భారత్‌ పూర్తిగా స్వీయనిర్ణయాలనే తీసుకుంటుంది. అందులో రష్యా వంటి మిత్రదేశాల పాత్ర ఉండబోదు. భారత్‌ తనకు లాభదాయకమైన చోటే ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తుంది. ఆ స్వేచ్ఛ భారత్‌ ఎప్పుడూ ఉంటుంది’’అని పెస్కోవ్‌ అన్నారు. మీ వద్ద చమురు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లుచేస్తున్న నేపథ్యంలో భారతవైఖరి మారిందా? అన్న ప్రశ్నకు పెస్కోవ్‌ సమాధానమిచ్చారు. 

‘‘భారత్‌ అనేది తన ఆర్థిక ప్రయోజనాలకే మొదట్నుంచీ పెద్దపీట వేస్తోంది. ఇకమీదట సైతం భారత్‌లోని మా చమురుభాగస్వాములు అదే బాటలో పయనిస్తారని భావిస్తున్నాం’’అని అన్నారు. వద్దని వారించినా రష్యా నుంచి భారత్‌ పెద్ద ఎత్తున ముడిచమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాల భారం పడేసిన విషయం విదితమే. 

2022లో మొదలైన ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా నుంచి అత్యధిక స్థాయిలో క్రూడ్‌ఆయిల్‌ను కొంటున్న దేశాల్లో భారత్‌ సైతం ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. అయితే ఇటీవలకాలంలో పశ్చిమదేశాల ఒత్తిడితో రష్యా నుంచి కొనుగోళ్లలో తగ్గుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియాలో ఇప్పటికే కథనలు వెలువడ్డాయి. ‘‘మాకు అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర ఉంది. మా నుంచే భారత్‌ కొనుగోళ్లు చేయాలనుకుంటే ఆంక్షల ఛత్రం నుంచి ఒడుపుగా తప్పించుకుంటూనే భారత్‌కు ఆయిల్‌ సరఫరాచేసే నైపుణ్యాలు మాకు ఉన్నాయి’’అని క్రెమ్లిన్‌ ఆర్థిక సలహాదారు మాక్సిమ్‌ ఒరెష్కిన్‌ ‘ఛానల్‌1’ఇంటర్వ్యూలో చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)