Breaking News

కెనడాలో కాన్సులర్‌ క్యాంప్‌లు రద్దు చేసిన భారత్‌

Published on Thu, 11/07/2024 - 10:38

భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన సంబంధాలు రోజురోజుకీ దెబ్బతింటున్నాయి. ఇటీవల కెనడాలో హిందూ ఆలయంపై దాడి జరగడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో  భారత్‌  కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశంలో కాన్సులర్‌ క్యాంప్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు టొరంటోలోని కాన్సులేట్‌ జనరల్ ఆఫ్ ఇండియా గురువారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది.

‘కెనడాలోని భారత కమ్యూనిటీ క్యాంప్‌ నిర్వహకులకు  కనీస భద్రత కల్పించలేమని అక్కడి భద్రతా ఏజెన్సీలు తెలిపాయి. అందువల్ల ముందుజాగ్రత్త చర్యలో భాగంగా మా షెడ్యూల్‌ కాన్సులర్‌ క్యాంప్‌లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

కాగా ఇటీవల కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు వీరంగం సృష్టించారు. భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు.. కర్రలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)