Breaking News

భారత దౌత్యవేత్తల బహిష్కరణ కథనాలు.. స్పందించిన అమెరికా

Published on Wed, 10/30/2024 - 15:03

న్యూయార్క్‌:భారత్‌, కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రికత్తల నేపథ్యంలో ప్రతిస్పందనగా భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిపై తాజాగా అమెరికా స్పందించింది. సదరు వార్తలను అమెరికా విదేశాంగశాఖ తోసిపుచ్చింది. 

సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో భారతీయ హైకమిషన్‌ పేరును కెనడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉ‍న్నట్లు కెనడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అమెరికా సైతం భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని యోచిస్తున్నట్లు ఆ కథనాల సారాంశం.

అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవాలని అమెరికా పరిశీలిస్తున్నట్లు వెలువడిన కథనాలను ఖండించారు.‘‘ మేం భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు వెలువడ్డ నివేదికల విషయం గురించి నాకు తెలియదు. అటువంటి బహిష్కరణ గురించి మేం ఆలోచించలేదు. అంతా ఊహాగానాలు మాత్రమే’’ అని అమెరికా వైఖరిని స్పష్టం చేశారు.

ఈ నెల ప్రారంభంలో భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణలు చేయటంతో ప్రతిస్పందనగా భారతదేశం కెనడాలో ఉన్న తన ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అదేవిధంగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను కూడా భారత్‌ బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రక్తలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ పరిణామాలు  కెనడా, భారత్‌ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)