Breaking News

భారత్‌-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం

Published on Thu, 09/28/2023 - 11:42

న్యూయార్క్‌: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ కానున్నారు. భారత్‌-కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ వీరి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఇరుదేశాల మధ్య చెలరేగిన వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు అధికార వర్గాలు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా..? ప్రశ్నించినప్పుడు.. ఈ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని భారత్‌ను ఇప్పటికే కోరినట్లు యూఎస్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కెనడా, భారత్ రెండు దేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత్‌తో సంబంధాలు పెంచుకోనున్న నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసులో కెనడాకు అమెరికా మద్దతుగా నిలవడంలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిరాధారమైన ఆరోపణలను భారత్ ఖండించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. ఈ కేసులో భారత్‌పై ఒత్తిడి పెంచడంలో అమెరికా విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌తో సంబంధాలు పెంచుకునే నేపథ్యంలోనే కెనడాను పక్కకు పెడుతోందని వాదనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో భారత్‌ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోరింది.

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్లింకెన్‌తో అనధికారికంగా ఇప్పటికే ఒకసారి కలిశారు.కానీ కెనడా-భారత్ వివాదం చర్చకు రాలేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లో జరిగిన క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని మిల్లర్ తెలిపారు.

ఇదీ చదవండి: చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మ దహనం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)