Breaking News

రష్యాకు 70 వేల మంది భారత కార్మికులు

Published on Tue, 11/11/2025 - 05:09

మాస్కో: ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా అర్హత కలిగిన, నిపుణులైన కార్మికుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రష్యా భారత్‌ వైపు చూస్తోంది. తమ సమస్య పరిష్కారానికి త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. కనీసం 70 వేల మంది భారతీ యులను ఈ ఏడాది చివరికల్లా రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ, వస్త్ర, ఇంజనీరింగ్, ఎల క్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో చేర్చుకోనుంది. 

వీరికి అవసరమైన ఏర్పాట్లను రష్యా కార్మిక శాఖ చేపట్టింది. డిసెంబర్‌ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో పర్యట నకు రానున్నారు. ఆ సమయంలో ఇరు దేశాలు ఇందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందం ఫలితంగా భారతీయ కార్మికులు, సిబ్బందికి రష్యాలో చట్ట పరమైన రక్షణలు లభిస్తాయి. ఈ పరిణామాన్ని మాస్కోలోని ఇండియన్‌ బిజినెస్‌ అలయెన్‌(ఐబీఏ) స్వాగతించింది. 

భారత్‌– రష్యా సంబంధాల్లో ఇదో వ్యూహాత్మక మైలురాయిగా మారనుందని ఐబీఏ ప్రెసిడెంట్‌ సమ్మీ మనోజ్‌ కొత్వానీ అభివర్ణించారు. భారతీయ నిపుణులకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూనే, రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవశక్తిని అందనుందన్నారు. భారతీయ సిబ్బందికి అవసరమైన రష్యన్‌ భాషా నైపుణ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వారి సంక్షేమానికి, భద్రతకు సంబంధించిన అంశాలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉంటామన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)