యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

Published on Tue, 08/06/2024 - 17:31

బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం  భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.

కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‍‌లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. 

దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)