Israel: ప్రజా ఆందోళనలు.. ముందస్తు ఎన్నికలకు డిమాండ్‌

Published on Sun, 06/23/2024 - 09:15

ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని, దేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

ఇజ్రాయెల్‌లోని కప్లాన్ స్ట్రీట్‌లో ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్‌మాన్ ఈ ఆందోళనల్లో పాల్గొని, దేశం కోసం ప్రజలంతా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షిన్ బెట్ మాజీ అధిపతి యువల్ డిస్కిన్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశిస్తూ ‘దేశ చరిత్రలో అత్యంత చెత్త , విజయవంతం కాని ప్రధాన మంత్రి’ అని పేర్కొన్నారు. వెంటనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిస్కిన్ 2005 నుండి 2011 వరకు షిన్ బెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అధ్యక్షునిగా పనిచేశారు. అధికార లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటిన్స్కీ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే నినాదాలు కలిగిన బ్యానర్లు పట్టుకున్నారు. మరికొందరు గాజాలో యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ర్యాలీ అనంతరం పలువురు ఆందోళనకారులు  ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాహనాల టైర్లను తగులబెట్టారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం మౌంటెడ్ పోలీసు సిబ్బంది  ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు  నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు. హమాస్ చేతిలో బందీలైనవారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్‌లో నిరసన కవాతు నిర్వహించారు.

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)