Breaking News

ఇమ్రాన్‌ను కలవనివ్వండి.. ఖురాన్‌తో సోదరిల నిరసన

Published on Wed, 01/14/2026 - 15:31

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.

కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌ మాజీ ‍ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా  హాట్‌ టాఫిక్‌గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్‌ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్‌లో చర్చనీయాంశమైంది.

ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్‌లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.

దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)