Breaking News

జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి

Published on Tue, 12/02/2025 - 19:43

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రస్తుతం  ఈ మాజీ క్రికెటర్ అంశం  పాకిస్థాన్ లోనే కాకుండా ఇతర దేశాలలోనూ చర్చనీయాంశం అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధానిని జైలులోనే చంపేశారని పుకార్లు రావడంతో ఆ దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో  మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను ఆమె సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిసింది.

మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నాడా లేదా అనే అంశం ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న  ఆయనను  కలవడానికి కొంతకాలంగా అక్కడి అధికారులు నిరాకరించడం, దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని పుకార్లు రేగడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలని, ఆయనను కలవడానికి అనుమతించాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ ని ఆమె సోదరి డాక్టర్ ఖానుమ్  జైలులో కలిసింది. అతనితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" దేవుడి దయ వల్ల ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు. కానీ మానసికంగా ఆయనను చాలా వేధిస్తున్నారు. ప్రతిరోజు సెల్ లో నిర్భంధిస్తున్నారు. ఆయనను ఎవరితోనూ కలవనివ్వడం లేదు. కేవలం కొద్దినిమిషాలు మాత్రమే ఆయనను బయిటకి వదులుతున్నారు". అని  తెలిపింది.

తాను జైలులో ఉండడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని  ఆయన ఇమ్రాన్ అన్నారని ఆమె తెలిపింది. మెుత్తానికి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలియడంతో  ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని 2023లో అరెస్టు చేశారు. దేశద్రోహం, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఇలా ఆయనపై 121 కేసులు మోపారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ లో హింస చేలరేగింది. ఆయన మద్ధతు దారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో  500మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు