Breaking News

యూఎస్‌లో లాటిన్‌ రగడ 

Published on Thu, 06/12/2025 - 06:08

వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్‌ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్‌ ఏంజెలెస్‌లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్‌ ప్రజలను ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. 

వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్‌ ఏంజెలెస్‌లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్‌ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. 

అంతటా మెక్సికన్‌ జెండాలే! 
లాస్‌ ఏంజెలెస్‌ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్‌ అమెరికన్లే. 

వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్‌ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్‌ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు