హమాస్‌కు కోలుకోలేని షాక్.. వీడియో వైరల్‌

Published on Mon, 01/05/2026 - 11:31

గాజా సిటీ: ఉత్తర గాజాలో హమాస్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించే లక్ష్యంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎప్‌) తన ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేసింది. వ్యూహాత్మక ప్రాంతమైన ‘ఎల్లో లైన్’ వెంబడి ఐడీఎఫ్ దళాలు భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం మరో విజయం సాధించింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా తాజాగా భూగర్భంలోని రహస్య హమాస్ నెట్‌వర్క్‌ను ఐడీఎఫ్ ఛేదించింది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగ మార్గాన్ని ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. దీనిని హమాస్ తన కార్యకలాపాలకు, ఆయుధాల తరలింపునకు ఉగ్రవాదుల ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్నట్లు సైనిక వర్గాలు ధృవీకరించాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ సొరంగం విస్తృతిని అంచనా వేసిన ఇజ్రాయెల్ దళాలు దానిని ధ్వంసం చేసే ప్రక్రియను చేపట్టాయి.
 

ఎల్లో లైన్ వెంట జరుగుతున్న ఈ ఆపరేషన్ కేవలం భూగర్భానికే పరిమితం కాలేదు. ఉపరితలంపైన, భూగర్భంలో ఉన్న అన్ని రకాల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను విడతల వారీగా అధికారులు తొలగిస్తున్నారు. హమాస్ స్థావరాలను, ఆయుధ డిపోలను, కమ్యూనికేషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఉత్తర గాజాలో ఉగ్రవాదులపై నియంత్రణ సాధించడం అత్యంత కీలకమని సైనిక నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ క్లీనింగ్ ఆపరేషన్ ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఎల్లో లైన్ వెంబడి ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఉగ్రవాదులు మళ్లీ ప్రవేశించకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఐడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ భారీ సొరంగం విధ్వంసం హమాస్ సామర్థ్యంపై భారీ దెబ్బ అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ‘అహింసా మంత్రం’

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)