Breaking News

"నేను మంచి తండ్రిని కాలేకపోయా"

Published on Sat, 02/28/2026 - 10:09

ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఇతరులు యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు. తను ఒక మంచి తండ్రిగా ఉండలేక పోయానన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలయ్యి నాలుగేళ్లు గడిచింది. ఈ సంగ్రామంలో దాదాపు 20 లక్షల మందికి  పైగా ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్‌ ఫర్‌ స్ట్రాటిజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(సీఎస్‌ఐఎస్‌)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ యుద్ధం ముగింపుకోసం ఎన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగ  ప్రకటన చేశారు.

ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఈ యుద్ధ సమయంలో నేను మంచి తండ్రిగా ఉండలేకపోయా,  ఎందుకంటే నాపిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయా,  ఎందుకంటే నేను ఉక్రెయిన్ అధ్యక్షున్ని, నామెుదటి ఎంపిక ఎప్పుడూ దేశమే"  అని జెలెన్‌స్కీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. 

మా ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
అయితే రష్యా దాడులతో దేశంలో ఎలక్ట్రిసిటీ లేక దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెలెన్‌స్కీ తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం మైనస్ 30 డిగ్రీలకు చేరుకుందని దీంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. అయితే యుద్ధం వల్ల పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి పునరుద్దరిద్దామంటే రష్యా దాడులతో అది సాధ్యపడడం లేదన్నారు.

ట్రంప్‌కు థ్యాంక్స్‌

కొద్దిరోజుల క్రితమే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడానని  శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలని తెలిపారు. అయితే తమ దేశానికి చెందిన భూభాగాలని రష్యా తమదని ప్రచారం చేసుకోవడంతో విభేదాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేయాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. అయితే రష్యా  ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దాని బదులు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)