Breaking News

భగ్గుమన్న ఇజ్రాయెల్‌.. ప్రధాని నెతన్యాహూ క్షమాపణలు

Published on Tue, 09/03/2024 - 15:36

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాజాలోని సొరంగంలో లభ్యమైన ఆరుగురు ఇజ్రాయెల్‌ బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు బెంజమిన్‌ సోమవారం క్షమాపణలు కోరారు. 

‘బందీలను సజీవంగా తిరిగి తీసుకురానందుకు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేము ప్రయత్నించాం కానీవిజయం సాధించలేదు. దీనికి హమాస్ చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.’ అని నెతన్యాహు  విలేకరుల సమావేశంలో చెప్పారు.

కాగా శనివారం గాజాలోని రఫా ప్రాతంలోని భూగర్భ సొరంగంలో ఆరుగురు ఇజ్రాయిల్‌ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు  ఆదేశ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.

మృతదేహాలు గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బట్జ్ కమ్యూనిటీకి చెందిన కార్మెల్ గాట్‌, ఈడెన్ యెరుషల్మి, అల్మోగ్ సరుసి, ఒరి డానినో, యుఎస్-ఇజ్రాయెలీ హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్, రష్యన్-ఇజ్రాయెలీ అలెగ్జాండర్ లోబనోవ్‌గా గుర్తించారు. వీరిని అక్టోబర్ 7న మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నుంచి కిడ్నాప్ చేసిన హమాస్‌ ఉగ్రవాదులు బందీలుగా చేశారు.

హమాస్‌ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యం కావడంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్‌ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్‌ చేస్తూ టెల్‌ అవీవ్‌ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. తమ ఆప్తులు 11నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కు తేవడంలో నెతన్యాహు విఫలమయ్యారంటూ ఆరోపించారు.

ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుయే కారణమన్న కోణంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. హమాస్‌తో బందీల విడుదల ఒప్పందం, కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)