Breaking News

లాటరీలో రూ. 18 కోట్ల జాక్‌పాట్‌.. ఒక్క ఈమెయిల్‌తో జీవితాలు తారుమారు

Published on Mon, 08/14/2023 - 08:52

ఆ జంటకు లాటరీ తగలడంతో వారిద్దరూ ఆ సొమ్మును ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేస్తూ, ఎంజాయ్‌ చేశారు. ఇంతలో వారికి వచ్చిన ఒక ఈమెయిల్‌ వారి జీవితాలను దుర్భరం చేసింది. తమకు లాటరీలో £1.8 మిలియన్‌(18 కోట్లు) వచ్చిన విషయం, ఆ తరువాత భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్‌ తమను ఎలా విడదీసినదీ ఆ మహిళ తెలిపింది.
 
భారీ మొత్తంతో ఇల్లు కొనుగోలు
రోజర్‌, లారా గ్రిఫిథ్స్‌లు 2005లో నేషనల్‌ లాటరీలో జాక్‌పాట్‌ కొట్టారు. ఆ సొమ్ములోని కొంత మొత్తంతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఎంజాయ్‌ చేసేందుకు మిగిలిన మొత్తం ఖర్చు చేశారు. దీంతో వెనక్కి తిరిగిచూసుకుంటే తమ దగ్గర అస్సలు డబ్బులు మిగలలేదని లారా తెలిపింది. చాలామంది మాదిరిగానే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దుబాయ్‌లో ఎంజాయ్‌
లాటరీ సొమ్ము అందిన కొన్ని వారాలకు రోజర్‌£18,000తో సాఫ్ట్‌-టాప్‌ ఆడీ కొనుగోలు చేశాడు. లారా తాము దుబాయ్‌లో ఎంజాయ్‌ చేసేందుకు, బిజినెస్‌ క్లాస్‌లో విమాన ప్రయాణం కోసం టిక్కెట్లు కొనుగోలు చేసింది. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రోజర్‌ మాట్లాడుతూ తాము 10 రోజుల్లో £15,000 ఖర్చు చేశామని తెలిపారు. ఆమెకు హ్యాండ్‌ బ్యాగ్‌లన్నా, షాపింగ్‌అన్నా ఇష్టమని అ‍న్నారు.

 
దంతాలను తెల్లగా మార్చుకునేందుకు..
డైలీస్టార్‌ తెలిపిన వివరాల ప్రకారం రోజర్‌ తన దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖర్చు చేశాడు. కూల్‌గా కనిపించేందుకు డిజైనర్‌ దుస్తులు కొనుగోలు చేశారు. బొటెక్స్‌ కోసం ఒకసారి  £300 ఖర్చు చేశాడు. టాటూల కోసం £500కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడు. లాటరీ గెలుచుకున్న ఎనిమిదేళ్ల తరువాత అంటే 2013 నాటికల్లా వారి దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. వారి అనుబంధం కూడా ముగిసింది. 

రోజూ విలాసవంతమైన పార్టీలు
14 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపాక వారు విడిపోయారు. తమ ఆర్థిక దుస్థితికి కారణం నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపించుకున్నారు. లారా మాట్లాడుతూ లాటరీ గెలుచుకున్న తరుణంలో తమ మధ్య వివాదాలు లేవన్నారు. తాము రోజూ పార్టీలు చేసుకునేవారమన్నారు. ఆనందంగా కాలం గడిపామన్నారు. అయితే డబ్బును ఎలా కాపాడుకోవాలో తమకు తెలియలేదన్నారు. 

బూడిదైన భవనం.. భారీగా నష్టం
తాము లాటరీ సొమ్ములోని £670,000తో నార్త్‌ యార్క్‌షైర్‌లో కొనుగోలు చేసిన భవనం 2010లో కాలి బూడిదయ్యిందన్నారు. తాము ఆ ఇంటికి తక్కువ మొత్తానికే బీమా చేయించామన్నారు. ఆ  సొమ్ము వచ్చినప్పుడు తన భర్తకు వచ్చిన ఒక ఈమెయిల్‌ తాను చూశానని లారా తెలిపింది. దానిలో భర్త అతని స్నేహితుడిని మరో యువతి ఫోన్‌ నంబర్‌ అడిగినట్లు ఉందన్నారు. అదే తమ జీవితాలను దుర్భరం చేసిందన్నారు. తాను తన భర్త అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణను గమనించానని లారా పేర్కొన్నారు. తన భర్త ఒక యువతి ఫోన్‌ నంబర్‌ అడిగిప్పుడు అతని స్నేహితుడు ఆమెతో ఎంజాయ్‌ చేసేందుకు భర్తకు సలహాలు ఇచ్చాడని లారా తెలిపింది. 

దూరమైన భర్త
దీనిని తాను గమనించానని తెలిసినా తన భర్త తనను క్షమాపణలు కోరలేదని, పైగా అతని బ్యాగు సద్దుకుని, తనపై అరుస్తూ, తనను నిందిస్తూ వెళ్లిపోయాడని లారా తెలిపింది. తరువాత ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేశాడని, ఫేస్‌బుక్‌లో అతనిని సంప్రదించేందుకు ప్రయత్నించగా తనను బ్లాక్‌చేశాడని లారా తెలిపింది. వారం రోజుల పాటు అతనిని ద్వేషించానని, ఆ తరువాత అతనిని మనసులోనే క్షమించేశానని, ఎందుంటే అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని లారా పేర్కొంది.  
ఇది కూడా చదవండి:‘గే లవ్‌ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)