Breaking News

‘బీజింగ్‌కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’

Published on Thu, 12/18/2025 - 12:53

న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్‌తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్‌, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్‌' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్‌లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.

బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!
వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్‌వర్క్‌లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్‌కు వేదిక కావడం విశేషం.

అయితే భారత్‌లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్  మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్‌ సుతార్‌ కన్నుమూత
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)